Homeజాతీయంకృతి సనన్: రక్షాబంధన్ యాడ్‌పై సోషల్ మీడియాలో చర్చ, ప్రకటనను వెనక్కి తీసుకున్న కంపెనీ

కృతి సనన్: రక్షాబంధన్ యాడ్‌పై సోషల్ మీడియాలో చర్చ, ప్రకటనను వెనక్కి తీసుకున్న కంపెనీ

- Advertisement -

రక్షాబంధన్‌కు ముందు ఒక ఆభరణాల బ్రాండ్‌ ప్రకటన (యాడ్) సోషల్ మీడియాలో వివాదానికి కారణమైంది.నటి కృతి సనన్ ఈ ప్రకటనలో కనిపించారు. కొంతమంది ఆమె దుస్తులుపై విమర్శలు చేశారు. అలాగే ఆమె తన కుక్కకు రాఖీ కట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దీనిపై స్పందించడంతో ఈ వివాదం ముదిరింది. ఆ ప్రకటన అసౌకర్యంగా అనిపించేలా ఉద్దేశపూర్వకంగా చేశారని కంగనా రనౌత్ అన్నారు.”సంస్కృతి మనసులో ఉంటుంది, నెక్ లైన్‌లో కాదు” అని కృతి సనన్ బదులిచ్చారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతి సనన్‌కు మద్దతు తెలిపారు. తమ స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపాలని అన్నారు.అయితే, ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరగడంతో దీన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.

ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆ కంపెనీ ఇలా రాసింది

“భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు,పండుగల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. ఒక బ్రాండ్‌గా, ఈ ఆనంద క్షణాలను కుటుంబమంతటితో కలిసి జరుపుకోవాలని మేము ఎప్పుడూ నమ్ముతాం. ఈసారి, ఈ ప్రేమను, వేడుకను మా పెంపుడు జంతువులకు కూడా అందించాలనుకున్నాము. మా ఇటీవలి ప్రకటన అనుకోకుండా సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసి ఉంటే, అది మా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. గౌరవ సూచకంగా, మేము ఆ ప్రకటనను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాం” అని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు