ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
విశాలాంధ్ర – అనంతపురం : టౌన్ మహిళలందరికీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, తెలుగుమహిళలు, బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీక అని అన్నారు. మహిళల భద్రత, గౌరవం, ఆత్మగౌరవం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


