కవిత్వమంటే ఒకప్పుడు ఊహల్లో విహరించడం, మనసుకి ఆనందాన్ని వెతుక్కోవడం. రచనా విన్యాసాలలో తేలియాడడం. ప్రాచీన కావ్య సౌందర్యాన్ని బహిర్గతపర్చడం. మరిపుడు కవిత్వం దారి మారింది. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏరి, సమాజం వేదికపైన నిలపడం. పరిష్కారాన్ని సూచించడం. యువతని చైతన్యపర్చడం. కర్తవ్యం బోధించడం. దేశాన్ని అభ్యుదయం వైపు నడిపించడం.
ఇప్పటి కవిత్వానికి సామాజిక బాధ్యత ఉంది. నిర్దిష్టమైన కర్తవ్యం ఉంది. ముందుతరం కవులు ఈ అభ్యుదయ మార్గాన్ని ఎంచుకుని, జాతికి చేయగల్గినంత సేవ శక్తి మీర చేయడం మన మెరుగుదం. ఆ తరాన్ని అందిపుచ్చుకున్న కవులలో డా॥ఉమ్మిడిశెట్టి రాధేయ ఒకరు. వీరు నాకంటే సరిగ్గా ఒక సంవత్సరం చిన్నవారు. అంటే 1955 మేడే రోజున కడపజిల్లా ముద్దనూరు మండలంలోని యామవరం అనే గ్రామంలో ఉమ్మిడిశెట్టి గంగిశెట్టి, నాగమ్మ దంపతులకు జన్మించారు. వీరిది కష్టానికి అంకితమైన సామాన్య చేనేత కుటుంబం.
రాధేయకి చిన్ననాటి నుండే ప్రకృతి పట్ల, తెలుగు భాష పట్ల ప్రేమ్ఙాóమానాలు మెండు. 1972 లో వీరి తొలి కవిత పత్రికలో అచ్చయింది. నేనూ నా తొలి కథ 1972 లోనే కాలేజి మ్యాగ్జైన్లో అచ్చు కావడం ద్వారా సాహిత్యరంగంలో అడుగుపెట్టాను. రాధేయ 1982లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా వృత్తి నిర్వహిస్తూనే ఎంఏ తెలుగు చదివి, అటుపైన పీహెచ్డీ చేసి, డాక్టరేట్ పొందారు. తద్వారా జూనియర్ కాలేజీ లెక్చరర్గాను, తర్వాత డిగ్రీ కాలేజీ లెక్చరర్గాను ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2013లో పదవీ విరమణ చేశారు.
రాధేయ జీవితంలోకి సత్యాదేవి అర్ధాంగిగా 1979లో ప్రవేశించారు. ఈ కవి 1978లో తొలి కవితా సంపుటి మరో ప్రపంచం కోసం వెలువరించారు. అది మొదలు దివ్యదృష్టి, క్షతగాత్రం, మగ్గం బతుకు, మానవీయం, పావుకోళ్లు వంటి పన్నెండు కవితాసంపుటాలు, మరో పన్నెండు సాహిత్య విమర్శ కావ్యాలు వెలువరించారు. వీరు కవి మాత్రమే కాదు, కవిత్వాన్ని ప్రోత్సహించే సంస్థ కూడాను. ఉమ్మిడిశెట్టి లిటరరీ ట్రస్టు ప్రారంభించి సాహితీ అవార్డులను ప్రకటిస్తూ, కవిత్వాన్ని, కవులను ప్రోత్సహిస్తున్నారు. కవిగా, సాహిత్య విమర్శకుడిగా అనేక పురస్కారాలు వీరి ఖాతాలో జమయ్యాయి.
అటువంటి రాధేయ కవిత్వం గురించి కూడా నాలుగు విషయాలు చెప్పకోవాలి. అన్నం ఉడికిందా లేదా అని చూడాలంటే కుండలోని ప్రతి మెతుకుని పట్టుకుని చూడనవసరం లేదు కదా! పావుకోళ్లు కవితా సంపుటిని చూద్దాం. ఇందులో 76 కవితలున్నాయి. అభ్యుదయ అంశాలను ఎంచుకుని రాశారు. కరోన కవితలున్నాయి. స్మృతి కవిత్మూ ఉంది. పావుకోళ్లు అనేవి చేనేత మగ్గంలోని ఒక పరికరం. దానిని కాళ్లతో పని చేయిస్తారు.
ప్రారంభంలోనే “అక్షరమా నీకు సెల్యూట్” అంటాడు కవి. అక్షరాన్ని ప్రేమించిన వాడు చేసే పనే ఇది. పైగా బాల్యం నుండి తెలుగు భాషను ప్రేమించినవాడే కవి. “శ్వాసించినా, ధ్యానించినా/ నీ ప్రతి స్మృతీ నాకు పరిమళ సుగంధమే/ ఓ నా ప్రియమైన కవిత్వమా/ నీకు జోహార్!/ నన్ను అమితంగా ఇష్టపడే అక్షరమా/ నీకు సెల్యూట్” అంటాడు.
చేనేత పరిశ్రమ రానురాను కుంటుపడతా ఉంది. నేతగాడి జీవితంలో వెన్నెలకి బదులు చీకటి అలుముకొంటా ఉంది. ఒకనాటి వైభవం మాయమైపోవడం ప్రత్యక్షంగా దర్శించిన చేనేత కుటుంబం నుంచి వచ్చిన కవి.“శేషగిరి వాసునికి శేష వస్త్రాలు/ సమర్పించే వస్త్ర శిల్పుల/ చేతులు విరిగిపోయి/ మగ్గాల శాలలన్నీ మరణశాసనాలై/ అంటూ వాస్తవ రేఖలతో చేనేత ముఖచిత్రాన్ని గీయడం గమనించవచ్చు.
గత అనుభవాలు జ్ఞాపకాలుగా మనసులో సందడవుతాయి. అవి ఆనందపరిచేవి అయితే ఉత్తేజం కలుగుతుంది. కాని అవి గాయాల్ని రేపేవి అయితే నరకమే కదా! గాయాలు కదా సలపాలి. మరి జ్ఞాపకాలెందుకు సలుపుతాయి అని ప్రశ్నిస్తాడు కవి.
“వారసత్వ కులవృత్తులు/ విచ్ఛిన్నమైన విషాదంలోంచి/ నే నివాళ మాట్లాడుతున్నాను/ జీవన భృతిని కోల్పోయి/ మా పనిముట్లన్నీ అటకమీద కెక్కుతుంటే/ నేను గాయపడుతూనే ఉంటాను!” అని జవాబు వెతుక్కున్నారు కవి.
తండ్రి గొప్పతనం పైకి కనిపించదు గాని బిడ్డ అణువణువున అది ప్రేమను రగిలిస్తుంది. కవి తన తండ్రి గురించిలా అంటాడు.
“తాను పేదరికపు జడివానలో తడుస్తున్నా/ వీధి బడిలో చదువుకున్న విద్యావంతుడు/ తండ్రి క్రౌర్యం మాకు సోకకుండా కాపాడి/ పెంచి పోషించిన పౌరుషవంతుడు మా నాన్న.”
ఆయన ఈ కవి మనసులో ఎంత లోతుగా అల్లుకుపోయాడంటే“అన్నం ముందు కూర్చుని, మెతుకుల్ని/ ముద్దగా చేసుకుంటే నీ రూపమే కనపడుతుంది” అంటాడు. ఈరోజు నాలుగు మెతుకులు తింటున్నాడంటే, అది ఆయన శ్రమ, చలువ అని చెప్పి తీరాలి. ఇంకో మాటంటాడు కవి. “ఒక్కమాట చెప్పనా!/ మా నాన్న గుండె ధైర్యం/ మా అమ్మ రెక్కల కష్టం కలగలిస్తే/ నేను నా కవిత్వమే!” ఇదే తల్లితండ్రుల పట్ల ఉన్న కృతజ్ఞతాభావం. జీవితమన్నాక కష్టాలు వస్తాయి. సుఖాలూ వస్తాయి. అవేవీ శాశ్వతం కావు. వస్తూ, పోతూ ఉంటాయి. కాని మనిషన్నాక నవ్వుతూ జీవన యాత్ర సాగించడం ముఖ్యం అంటారు కవి. కవిత్వానికి రంగు, రుచి, వాసనలున్నాయని అంటారు కవి. ఒక వాస్తవ దృశ్యాన్ని పాఠకుల ముందుంచారు. చూడండి “మా కవిత్వం కరువంత యదారœం/ ఆకలి అంత వాస్తవం/ కన్నీరంత స్వచ్ఛం” ఇక్కడ “మా” అంటే రాయలసీమ. ఇందులో కరోన సమయంలో రాసిన కవితలు కూడా ఉన్నాయి. ఇపðడిప్పుడే మరల కరోన కేసులు బయటపడుతున్నాయి. నేనింకా ఉన్నానని ఉనికి చాటుతా ఉంది.
ఒక సందర్భంలో“నియంత్రణ తప్ప చికిత్సలేని/ నెగిటివ్ కరోన కోసం/ జనతా కర్ఫూయూ జల్లెడ పడుతోంది/ మృత్యువు భయపెడుతోంది/ మృత్యుభయం వణికిస్తోంది” ఆ భయం ఎలాంటిదో చెబుతారిలా
“కంటికి కనిపించని సూదులేవో/ గొంతులో దిగుతున్నట్టుగా/ ఊపిరిని వడిదిప్పి పిండుతున్నట్టుగా/ ఉచ్ఛాÇస నిశ్వాసాల్లో ఒకటే అలజడి”
రాయలసీమ ప్రాంతంలో నీటిచుక్క రాలక రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన రోజుల్ని మన మెరుగుదం. అటువంటి సందర్భాన్ని కవి చెబుతున్నారిలా…“అదును పదును ఎరుగని ఋతువులు మావి/ మబ్బుల్ని చూసి ఆశపడితే/ పొలంలో పోసిన విత్తనాలన్నీ చీమలపాలే/ ఎడారి సేద్యంలో తడారిన గొంతుకలు మావి” కవి తత్వం ఎలాంటిదంటే“కరిగిపోయే మబ్బుల నుండి/ ఆకుపచ్చని జీవావరణంలోకి/ ధనుస్సుకై ప్రవేశించాలని ఉంది” అంటారు. రక్షించుకో అనే కవితలో కవి, తన మనసుని ఆవిష్కరిస్తూ ఇలా అంటారు.“సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు/ నీకు స్వీట్ మెమొరీస్/ ప్రతిభను గుర్తించలేని ప్రశంసలన్నీ/ నాకు వేస్ట్ పేపర్ బోట్స్” మన దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితిని చూస్తానే ఉన్నాం. ఈ కవి కూడా ఒకచోట ప్రజాస్వామ్యం గురించిలా అంటారు.“ప్రజాస్వామ్య రాజ్యాంగంలో/ ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలొస్తాయ్/ పార్టీలు మారతాయ్/ మ్యానిఫెస్టోలు ఊరిస్తాయ్/ రాజకీయం మారుతుంది. ఒక వాస్తవాన్ని సమాజం ముందుంచారు కవి. రాజకీయ దోపిడీ చిత్రాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా గీసే ప్రయత్నం జరిగిందిక్కడ. ఇందులో కొన్ని స్మృతి కవితలున్నాయన్నాను కదా. ఒక కవితలో“నా ధైర్యం, నా కవిత్వం/ దీనంగా నిలబడింది/ పడుగూ పేకై కలిసిపోయిన/ మన దాంపత్య బంధంలో/ పట్టుపోగు తెగిపోయింది/ అతుకు పడని పోగై/ బతుకు మగ్గం వణుకుతోంది.” అంటారు.
జీవిత భాగస్వామిని పట్టుపోగుతో పోల్చారు కవి.
సాగిపోయిన బాటలో నడిచి, మానవత్వాన్ని ప్రకటించిన జ్ఞానయోగే అంబేద్కర్ అంటారు.
“భాషాదారిద్య్రమే కాదు/ భావదారిద్య్రమూ/ క్షంతవ్యం కాదని” కవులకి చక్కటి సూచన చేశారు.
భారతం 18 పర్వాలైతే, భారతదేశంలో అత్యాచారాల్ని 19 వ పర్వంగా అభివర్ణించారు. కోవిడ్ కాలంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దంటారు. మరోచోట‘మౌనాన్ని ధిక్కరించి/ మాట్లాడ¦మే చైతన్యం/ పిరికితనాన్ని వదిలించుకొని/ ప్రశ్నించడమే హేతువాదం.” అయితే, ప్రశ్నని సహించలేని అసమర్థతలో మనం ఎన్నుకున్న నాయకులుండటం మన దౌర్భాగ్యమని చెప్పాలి. ఉగ్గుపాలతో ఊయలలూగిన భాష, ఉగ్గబట్టుకున్న దు'ఖంతో వెక్కిళ్లు పడుతోందని తెలుగు భాష పరిస్థితిని వివరించారు కవి. ‘ప్రొఫెషనల్ జలసీ’ అనే కవితలో మేధావుల గురించి చెబుతూ
“ప్రక్కవాడి ప్రతిభను/ మనసారా మెచ్చుకోలేని/ మానసిక అవిటితనంతో/ బాధపడుతున్నారు” అంటారు.
ఇంకా“ప్రాంతీయ ప్రతిభను వెక్కిరిస్తోంది/ కులం, వర్గం/ రాజకీయం ముందు/ మోకరిల్లుతోంది” అంటారు. ఇలా సమాజంలో మనిషిని ప్రభావితం చేస్తున్న అనేకానేక అంశాలను వర్ణించిన కవి, వాటికి చక్కటి చైతన్యపూరితమైన అక్షర రూపమిచ్చి కవిత్వంగా మల్చడం ఆనందదాయకం. ఈ కవిత్వం వరœమాన Å£వులను సరైన మార్గంలో పయనించేందుకు మార్గదర్శకం అవుతుందని నా నమ్మకం. ఎస్.ఆర్.పృథ్వి.
సెల్: 9989223245
సామాజిక చైతన్య దీప్తి రాధేయ కవిత్వం
- Advertisement -


