Homeజాతీయంబంగారం కొనొద్దు.. స్వదేశీ వస్తువులే వాడండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు

బంగారం కొనొద్దు.. స్వదేశీ వస్తువులే వాడండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు

- Advertisement -

దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులు, సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ నిర్వహించొద్దని చెప్పారు. అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.కిర్గిజిస్థాన్‌ నుంచి మంగళవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడుదల చేసిన వీడియోలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8 శాతం పెరిగిందని సోమవారం విడుదలైన గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఉన్నా భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని అన్నారు.‘‘విదేశీ దేశాలకు పర్యటనల కోసం వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ నిర్వహించొద్దు. ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ నినాదాన్ని పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారం కొనొద్దు’’ అని మోదీ సూచించారు.స్వదేశీ వస్తువులు, సేవలను ఎక్కువగా ఉపయోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. భారత్‌ స్వావలంబన సాధిస్తే స్వాతంత్య్రం వచ్చిన 100 ఏళ్ల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఏడాది మేలోనూ మోదీ ప్రజలకు పలు సూచనలు చేశారు. అవసరమైన చోట ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’, ప్రజా రవాణా వినియోగం పెంచాలని కోరారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు