Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి….

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి….

- Advertisement -

అనంతపురం జిల్లా:-

నార్పల తహసీల్దార్ కార్యాలయం. వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా…..

విశాలాంధ్ర -నార్పల:- మండలంలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి, జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలు అనేక సమస్యలతో lకొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. ఈ సమస్యల కారణంగా విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
నార్పల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలురకు మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో బాలికల పాఠశాల సమీపంలో ఉన్న బీసీ హాస్టల్‌ను ఇతర ప్రాంతానికి తరలించడం వల్ల విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో పాఠశాల, హాస్టల్ ఒకే ప్రాంతంలో ఉండటంతో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేదని, ప్రస్తుతం ఆ భవనాన్ని టైప్-4 కేజీబీవీగా వినియోగించడం వల్ల సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. కేజీబీవీలో 6, 7, 8 తరగతుల విద్యార్థినులకు కూడా ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.మండలంలోని విద్యారంగ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జయకృష్ణ, లక్ష్మీనారాయణ, గంగాధర్, భాస్కర్, శివరాజ్, సుధీర్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు