Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్ర అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది.. జి. శ్రీనివాసులు

రాష్ట్ర అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది.. జి. శ్రీనివాసులు

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం; రాష్ట్ర అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది అని రాష్ట్ర అవార్డు గ్రహీత గట్టుపర్తి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయుల జాబితాను ఇటీవలే ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులుగా విధులు నిర్వర్తిస్తున్న గట్టుపర్తి శ్రీనివాసులు కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. దీంతో సెప్టెంబర్ 5వ తేదీ గురుపూజోత్సవ దినోత్సవ సందర్భంగా విజయవాడలోని ఏవన్ కన్వెన్షన్ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా పురస్కార పత్రముతో పాటు బంగారు పతకము 20వేల రూపాయల విలువచేసే చెక్కును వారి చేతులమీదుగా అందుకున్నారు. తాను పూర్తిగా పేదరికంలో జన్మించానని, నా తల్లి చిన్న వయసులోనే మృతి చెందిందని, 2021లో అధ్యాపకునిగా రాయదుర్గం కు ఉద్యోగం వచ్చిన నెలకే మా నాన్న కూడా మృతి చెందడం జరిగిందని తెలిపారు. తదుపరి అకుంఠిత దీక్షతో విద్యార్థులకు నా వంతుగా విద్యను బోధిస్తూ బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు తాను రాయదుర్గం అనంతపురంలో అధ్యాపకునిగా పనిచేస్తూ 2021 అక్టోబర్ నెలలో ధర్మవరం కళాశాలలో అధ్యాపకునిగా చేరడం జరిగిందని తెలిపారు. 2023లో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతులమీదుగా తాను అవార్డు కూడా తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఏది ఏమైనా నాకు ప్రభుత్వం ద్వారా ఉత్తమ అవార్డు రావడం నాకెంతో సంతోషాన్నిచ్చిందని, భవిష్యత్తులో విద్యార్థులకు మరింతగా ఉత్తమ బోధన చేయుటకు కృషి చేస్తానని తెలిపారు. తదుపరి అవార్డు రావడం పట్ల ప్రిన్సిపాల్ ప్రశాంతి, అధ్యాపక, బోధ నేతర బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు