విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని జీవి ఈ జెడ్పిజిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ కళాజ్యోతి సర్కిల్ లో ఉన్నటువంటి స్కూల్లో మల్టీ స్టార్ బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ ఇనాయత్ భాషా బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జీవి ఈ జెడ్పి జిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ పిడి స్వరూప , సంద,జగన్నాథం వీరందరి చేతుల మీదుగా పిల్లలకు బెల్ట్లు ఎల్లో, ఆరెంజ్ ,గ్రీన్ ,బ్లూ ,పర్పల్ , బ్రౌన్, బెల్టులను ప్రశంస పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. అలానే చదువులతోపాటు క్రీడల్లో కూడా ముందుండి మీ ఆరోగ్యాన్ని ఆత్మస్ ధైర్యాన్ని పెంపొందించుకునే విధంగా ఈ క్రీడా రంగంలో ఉండడం వలన మీకు ఉజ్జలమైన భవిష్యత్తు తోడ్పడుతుందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా కింద 3 శాతమురిజర్వేషన్ పట్ల ఉద్యోగాలు వస్తాయన్నారు.కాబట్టి ప్రతి ఒక్కరూ కరాటే జూడో ఇలాంటి క్రీడలను నేర్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కరాటే క్రీడను నేర్చుకొని మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇతరులకు ఏ విధమైన ఆపద సమయంలో ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ ఏ. ఉదయ్ అండ్ కొండ. అర్చన వి.సింధు క్రీడాకారుల తల్లిదండ్రులు కార్యక్రమంలో సంతోషం వ్యక్తం చేశారు.
బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహణ.. కరాటే మాస్టర్ ఇనాయత్ భాష
- Advertisement -
RELATED ARTICLES


