Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల) ఆవరణంలో ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంటి వైద్య శిబిరమును, దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరమునకు 62 మంది కంటి రోగులు పాల్గొనగా, 32 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. నేటి ఈ శిబిరమునకు దాతలుగా కీర్తిశేషులు పిఆర్ సరోజమ్మ జ్ఞాపకార్థం భర్త పిన్ను రామకృష్ణ, హరిప్రసాద్ వారి కుటుంబ సభ్యులు పరిమళ, శైలజ వ్యవహరించడం పట్ల యువర్ ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కమిటీ తరఫున సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా యువర్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, దాత పిన్ను రామకృష్ణ మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ తరపున వందలాదిమందికి వైద్య చికిత్సలను అందించి, కంటి చూపు కలిగించడం ఆనందించదగ్గ గర్వించదగ్గ విషయమని తెలిపారు. తదుపరి డాక్టర్ ప్రాంశు కటీపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను రోగులకు వివరించారు. శిబిరమునకు వచ్చిన వారందరికీ కూడా టిఫిన్, భోజనముతో పాటు ఉచిత రవాణా, ఉచిత ఆపరేషన్, ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ రాధాకృష్ణ, డాక్టర్ బి వి సుబ్బారావు, పోలా ప్రభాకర్, వైకె శ్రీనివాసులు, చాంద్ బాషా, మాజీ కౌన్సిలర్ కేతా లోకేష్ సత్రశాల మల్లికార్జున ,సికిందర్, గరే రమేష్ బాబు, కళ్యాణ్, శివారెడ్డి, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు