నేరాలు నియంత్రించడమే ఈ నాకాబంది ఉద్దేశం.. అడిషనల్ ఎస్పీ. అంకిత సురానా
14,బృందాలతో 14, ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 12 మందిపై కేసులు నమోదు
విశాలాంధ్ర ధర్మవరం;జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం తెల్లవారుజామున3.3.30 వరకు ప్రత్యేక నాకాబంది కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పి అంకిత సురాన నిర్వహించారు. వీరి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జగన్నాథ్ రాజు , సీఐలు, రెడ్డప్ప, జయనాయక్, ప్రభాకర్ , మహమ్మద్ అలీ, సునీత ,రామసుబ్బయ్య ,10,ఎస్సైలు ఇతర పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్వయంగా పట్టణంలోని 14,ప్రాంతాల్లో 14, ప్రత్యేక బృందాలతో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.ప్రధాన రహదారులు, సరిహద్దు మార్గాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద నాకాబంది పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు తదితర ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన అనుమతి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లను సీజ్ చేశారు.అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వారి వివరాలను ఆరా తీశారు. రాత్రి వేళల్లో అనవసరంగా సంచరించే వ్యక్తులు, అనుమానాస్పద వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారునాకాబంది తనిఖీలలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 12 మందిపై కేసులు నమోదు చేశారు. 43, రికార్డు లేని మూడు ఆటోలు పై కేసు నమోదు చేశారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై సంచరించకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు.


