Homeతెలంగాణఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం

- Advertisement -
  • ఎగుమతులపై దిల్లీలో విస్తృత చర్చ
  • వాణిజ్యం పెంచే ప్రయత్నం మంత్రి ఉత్తమ్

విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు పెంచడంతోపాటు, ఫిలిప్పీన్స్‌తో వాణిజ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ, ఆహార వాణిజ్యాన్ని విస్తరించే అంశాలపై ఆయన మంగళవారం న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో చర్చించారు. తెలంగాణలో భారీ స్థాయిలో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి, ఆధునిక రైస్ మిల్లింగ్ సదుపాయాలు, ఎగుమతులకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయన్నారు. దీనికి లారెల్ స్పందిస్తూ పెద్ద పరిమాణంలో బియ్యం దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాల కొనుగోలుపైనా ఆయన ఆసక్తి చూపారు. విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణకు ఉన్న సామర్థ్యాలను ఉత్తమ్ వివరించారు. బియ్యం రకాలు, ధరలు, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానాలు, రవాణా, ధ్రువీకరణతోపాటు శానిటరీ నిబంధనలపై చర్చించారు. ప్రభుత్వ సంస్థలు, దిగుమతిదారులు, ఎగుమతి దారులు, రైస్ మిల్లర్లు, పరిశ్రమ ప్రతినిధులతో కలిసి స్పష్టమైన కార్యా చరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. డిసెంబర్‌లో హైదరా బాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు రావాలంటూ లారెల్ను ఉత్తమ్ ప్రత్యేకంగా ఆహ్వానిం చారు. వ్యవసాయం, బియ్యం, ఆహార ఉత్పత్తులు, విత్తన్ఙాóవృద్ధి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇద్దరు నిర్ణయించారు. ఫిలి ప్పీన్స్‌కు దిగుమతి చేసుకునే బియ్యం అవసరం గణనీ యంగా ఉండటం, అంతర్జాతీయంగా బియ్యం సరఫరా చేసే దేశాల సంఖ్యను విస్తరించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తుండటం నేపథ్యంలో ఈ చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. పోటీ ధరలు, విశ్వసనీయమైన నాణ్యత, నిర్ణీత సమయంలో సరఫరా చేయగల సామర్థ్యంతో తెలంగాణ దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవగలదని ఉత్తమ్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లలో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు కల్పించడం వల్ల రైతులు, రైస్ మిల్లర్లు, విత్తన కంపెనీలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని ఇతర వర్గాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. భారత్-ఫిలిప్పీన్స్‌ సంబం ధాలు, ఆహార భద్రత, వ్యవసాయ సహకారం, తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు ప్రత్యక్ష వాణిజ్యాన్ని పెంచే అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. వ్యవసాయం, బియ్యం, ఆహార ఉత్పత్తుల వాణిజ్యం, విత్తన్ఙాóవృద్ధి, అనుబంధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేలా ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం, ఫిలిప్పీన్స్‌ రాయబార కార్యాలయం, సంబంధిత ప్రైవేటు రంగ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు