Homeఆంధ్రప్రదేశ్ముగిసిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు .. విశ్వదీప సేవా సంఘం

ముగిసిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు .. విశ్వదీప సేవా సంఘం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; జాతీయ నేత్రదాన బచ్చోత్సవాలు ముగింపు సందర్భంగా విశ్వ దీప సేవా సంఘం ఆధ్వర్యంలో నేత్రదానం పై అవగాహన బైక్ ర్యాలీ డాక్టర్ సంకారపు నరసింహులు, ఆఫ్టలమిక్ అధికారి ఇ.ఉరుకుందప్ప ప్రారంభించినారు. అనంతరం డాక్టర్ నరసింహులు మాట్లాడుతు ఈ నేత్రధాన పక్షోత్సవాలు ప్రారంభి రోజే విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో నేత్రధానం చేయించడం ఈ పక్షోత్సవాలు జరుగుతున్న కాలంలో ధర్మవరం నుండి ఐదు మందించే నేత్రదానం చేయించడం రాష్ట్రం లోనే అత్యధికముగా మన ధర్మవరం ప్రాంతం నుండి నేత్రదానాలు చేయించిన స్వచ్చందంగా సంస్థలను అభినందించారు. అనంతరం ఉరుకుందప్ప మాట్లాడుచు ఈ పక్షోత్సవాలు లో ప్రతి సంవత్సరం ర్యాలీ చేస్తూ ప్రజలకు నేత్రదానం పై అవగాహన కల్పిస్తూ కర్నియ సేకరించడం లో విశ్వదీప సేవా సంఘం కృషి అమోఘమైనది అని తెలిపారు. విశ్వరూప సేవా సంఘం ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేత్రధాన అన్ని దానలకంటే గొప్పది నేత్రదానం శాశ్వత దానం దీనిద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చుఅని తెలిపారు. రక్త బంధం ట్రస్ట్ కన్నా వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నేత్రదానం పై అవగాహనతో ముందుకు వచ్చి అందత్వాన్ని నిర్ములించాలని తెలియజేసినారు.ఈ కార్యక్రమం లో అధ్యక్షులు గాజుల సురేష్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి కోశాధికారి జుజారు రఘు, మాధవ, ప్రభాకర్ రెడ్డి, శేషు, నాగ, కేశవరెడ్డి సుబ్రమాణ్యం,రెడ్డెప్ప, ఓబులయ్య,అక్కులప్ప, నాగేశం సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు