Homeజిల్లాలుఅనంతపురంఉత్తమ వైద్యులుగా పేరు తెచ్చుకోవాలి

ఉత్తమ వైద్యులుగా పేరు తెచ్చుకోవాలి

- Advertisement -

క్రమశిక్షణతో వైద్యవిద్యను అభ్యసించండి

వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయశ్రీ
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురంలో 2026 వ బ్యాచ్ వైద్య విద్యార్థుల పరిచయ కార్యక్రమం సెంట్రల్ హాలులో” ఎంబిబిఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం” పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ మల్లేశ్వరి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపర్ ఇంటెండెంట్ ఆచార్య డాక్టర్ బెనెడిక్ట కోయిల నూతన వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్యులను దేవుని తర్వాత దేవునిగా కొలుస్తారని, అలాంటి పరమ పవిత్రమైన వైద్య వృత్తిలోకి మీరు ప్రవేశించినందుకు మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, మీ తల్లిదండ్రుల కలలు, మీ కలను మీరు నెరవేర్చికుని ప్రతిష్టాత్మక అనంత వైద్య కళాశాలలో చేరడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో, విలువలతో కూడిన మంచి వైద్య విద్య నైపుణ్యాలను, వైద్య విద్యను అభ్యసించాలని, మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మంచి ఉపాధ్యాయులు ఇక్కడ శిక్షణ పొంది ఉన్నారని, వారి అడుగుజాడల్లో మీరు తప్పక విజయవంతం అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ కోఆర్డినేటర్, మరియు వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ షారూన్ సోనియా, ఫౌండేషన్ కోర్స్ కోఆర్డినేటర్ సహాచార్య డాక్టర్ పద్మ శ్రావణి ల నేతృత్వంలో వివిధ అంశాల పైన, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయశ్రీ, సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ బెనెడెక్టా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంషాద్ బేగం, డాక్టర్ శంకర్, డాక్టర్ షారోన్ సోనియా, డాక్టర్ తెలుగు మధుసూదన్, హాస్టల్ వార్డెన్ లు డాక్టర్ మీనిగ శైలజ, డాక్టర్ చైతన్య తదితరులు నూతన వైద్య విద్యార్థులకు కళాశాలలో ఉండాల్సిన క్రమశిక్షణ పద్ధతుల గురించి, తరగతుల గురించి, బోధన పద్ధతుల గురించి, ప్రయోగాత్మక పరీక్షల గురించి, క్లినికల్ ట్రైనింగ్ గురించి సోదాహరణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు. ఫౌండేషన్ కోర్సు కు కోఆర్డినేటర్ గా ఫార్మకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ పద్మ శ్రావణి వ్యవహరిస్తున్నారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల ప్రధాన విభాగాధిపతులు, వారి సిబ్బందిని వైద్య విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పరిచయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు