892 పోస్టులతో ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్లు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో 892 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్1 సర్వీసులో 163 పోస్టులతో పాటు వివిధ శాఖలలో 729 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయిదు విభాగాల్లో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనుండగా… మరో 10 విభాగాల పోస్టులకు ఈ నెల 24 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏపీపీఎస్‌సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టుల అర్హతల వివరాలను తెలియజేసింది. గ్రూప్1 పోస్టులకు అక్టోబరు 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్1 ద్వారా భర్తీ చేయనున్న పోస్టులలో డిప్యూటీ కలెక్టర్లు 11, ఏపీ టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్‌లు 14, డీఎస్‌పీ సివిల్ 36, డీఎస్‌పీ కమ్యూనికేషన్స్ 3, డీఈవోలు 14, ఆర్‌టీవోలు3, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డిప్యూటీ రిజిస్టర్ కోపరేటివ్ సర్వీసెస్ 15, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్`2-12, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 35 ఉన్నాయి. వీటితో పాటు వివిధ శాఖల్లోను ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.


