- Advertisement -
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజర్ ఆచూకీ తెలిపితే 70 లక్షల పాకిస్థానీ రూపాయల నగదు పురస్కారాన్ని పాకిస్థాన్ ప్రకటించడంపై భారత్ స్పందించింది. ఇలాంటి గిమ్మిక్కులు ఆ దేశానికి కొత్తేం కాదని విమర్శించింది. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ మీడియాతో మాట్లాడుతూ ‘అటువంటి గిమ్మిక్కులు, మోసపూరిత ప్రకటనలు పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. అదో బూటకపు ప్రకటన. కచ్చితమైన చర్యలు ఏవి’ వ్యాఖ్యానించారు. మసూద్ అజర్‌ను ఐరాస 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే.


