Homeతెలంగాణతెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరో 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు