రష్యాతో ఉక్రెయిన్ సంధి: ట్రంప్ దీమా
న్యూయార్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, రెండు దేశాలు ఒప్పందానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్‌లో ఐరాస సమావేశం క్రమ ంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయిన ఆయన శాంతి స్థాపన దిశగా చర్చించారు. భవిష్యత్ కార్యాచ రణపైనా అభిప్రాయాలు పంచుకు న్నారు. ఈ మేరకు ట్రంప్ మీడియాకు తెలిపారు. ‘రష్యా, ఉక్రెయిన్ అధినేత లు ఈ యుద్ధం ముగియాలంటు న్నారు. ప్రాణనష్టం పెరగడాన్ని కోరుకోవడం లేదు. కాబట్టి త్వరలోనే సంధి జరుగుతుందని నమ్ముతున్నాను. అయితే ఆ ఒప్పందం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. రెండు దేశాల అధినేతలతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం జరుగుతుంది’ అని ట్రంప్ వెల్లడించారు. జెలెన్స్కీతో తనకు వ్యక్తిగతంగా మంచి సంబం ధాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పకొచ్చారు. శాంతియుత పరిష్కా రానికి అనుకూలంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ సైనికుల ధైర్య సాహసాలను ప్రశంసించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలరని, తమ దేశం కోసం పోరాడుతున్న తీరు అభినందనీయమని అన్నారు. జెలెన్స్కీ మాట్లాడుతూ ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ బిల్లును అభినందించారు. తనకు, తన దేశానికి అండగా నిలిచినందుకుగాను అమెరికాకు, ట్రంప్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం త్వరలోనే ముగి యాలని ఆకాంక్షిం చారు. ట్రంప్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. శీతాకాలం నాటికి యుద్ధం ముగిసిపోతే బాగుంటుందని జెలెన్స్కీ అన్నారు.
ఏఐకు ట్రంప్ కొత్త పేరు
పేర్లు మార్చడం, కొత్త పేర్లు పెట్ట డంలో ట్రంప్ తనకు తానే సాటిగా నిలుస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ కృత్రిమ మేథ (ఏఐ)కు కొత్త పేరును సూచించారు. ఇకపై అధికారికంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (ఎస్ఐ)గా వ్యవహరించాలని అన్నారు. అన్ని దేశాలు దీన్ని అనుసరిస్తాయని ఆశించారు. ఏఐపై నియంత్రణకు జరుగుతున్న ప్రయత్నాలను ట్రంప్ వ్యతిరేకించారు. సాంకేతికత అభివృద్ధిని అడ్డుకునే అంతర్జాతీయ వ్యవస్థను అమెరికా అంగీకరించబోదని ఆయన స్పష్టంచేశారు. ఏఐతో కొత్త సవాళ్లు వస్తాయని, అవసరమైనప్పుడు చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. అత్యాధునిక ఏఐ, రోబోలు మానవాళికి పెనుముప్పుగా మారవచ్చన్న హెచ్చరికలను ట్రంప్ కొట్టిపారేశారు. ఏఐ భవిష్యత్తులో పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ కంటే పెద్ద మార్పు తేవచ్చన్నారు. ఏఐలో రాణించే దేశానిదే పైచేయి అవుతుందని ట్రంప్ అన్నారు.


