Homeఆంధ్రప్రదేశ్ఏపీలో మద్యం దుకాణాల లాటరీ వాయిదా.. కొత్త తేదీ ఇదే

ఏపీలో మద్యం దుకాణాల లాటరీ వాయిదా.. కొత్త తేదీ ఇదే

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లాటరీ నిర్వహణ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత సెప్టెంబర్ 30న లాటరీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, తాజాగా దానిని అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. నవీకరణ (రెన్యువల్) కాని సుమారు 400 మద్యం దుకాణాలకు కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈరోజు (గురువారం) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆసక్తి గల వ్యాపారులు గురువారం నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందిన దరఖాస్తుల ఆధారంగా అక్టోబర్ 5న లాటరీ నిర్వహించి, కొత్త లైసెన్సుదారులను ఎంపిక చేస్తారు. అయితే, ఒక దుకాణానికి కనీసం 10 దరఖాస్తులు వస్తేనే అక్కడ లాటరీ పద్ధతిని చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం నాటికి రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్ఈటీ) రెన్యువల్, లైసెన్స్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 1,268 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు