విశాలాంధ్ర ధర్మవరం;;దొరికిన మూడు తులాల బంగారు నెక్లెస్‌ను ఆశపడకుండా పోలీసులకు అప్పగించిన ముగ్గురిని ధర్మవరం టూ టౌన్ సీఐ జయ నాయక్ సత్కరించారు. అనంతరం సీఐ జయ నాయక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న కళ్యాణదుర్గం నుంచి ప్రైవేట్ బస్సులో ధర్మవరం వచ్చిన రాజేశ్వరి,బస్సు దిగే సమయంలో తన వద్ద ఉన్న మూడు తులాల బంగారు నెక్లెస్‌ను పోగొట్టుకున్నారు.అదే రోజు ఆమె ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.నెక్లెస్ దొరికిన కుమ్మర రామాంజనేయులు, ఆటో డ్రైవర్ నరసింహులు, కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సిద్ధమ్మలు నెక్లెస్‌ను సమీపంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్ఐ ఇషాక్ భాషాకు అప్పగించారు. అనంతరం పోలీసులు రాజేశ్వరిని పిలిపించి నెక్లెస్‌ను ఆమెకు తిరిగి అందజేశారు.
నిజాయితీగా వ్యవహరించిన రామాంజనేయులు, నరసింహులు, సిద్ధమ్మలను సీఐ జయ నాయక్ శాలువాలతో సత్కరించి, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికాన్ని అందజేశారన్నారు. దొరికిన బంగారు ఆభరణాన్ని వెంటనే పోలీసులకు అప్పగించడం వారి నిజాయితీకి నిదర్శనమన్నారు. ఇలాంటి వారి సహకారంతో ఆభరణాలు పోగొట్టుకున్న వారికి త్వరగా న్యాయం అందే అవకాశం ఉంటుందని తెలిపారు.ఎక్కడైనా బంగారు ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సూచించారు.
ధర్మవరంలో నిజాయితీకి పోలీసుల సత్కారం
- Advertisement -
RELATED ARTICLES


