విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల పట్టణంలోని కదిరిగేటి వద్ద వినాయక నిమజ్జన సమయంలో ట్రాక్టర్ ప్రమాదంలో మునిసిపల్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల శాంతినగర్ లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని రాగే వర్షిత మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా మరుసటి రోజు పాఠశాలకు ఎంఈఓ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించారు. తదుపరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి తమ వంతుగా ఆ కుటుంబానికి పదివేల రూపాయలను హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం కుటుంబానికి వెళ్లి నగదును అందజేశారు. హెడ్మాస్టర్ జానకి మాట్లాడుతూ పోయిన ప్రాణాన్ని తాము తేలేమని, విద్యార్థిని ప్రేమకు గుర్తుగా ఈ నగదును అందజేస్తున్నామని తెలిపారు. ఆ భగవంతుడు కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని, మృతి చెందిన రాగి వర్షిత ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భారతి, అనిత, అరుణ, ప్రవల్లిక, సాయి గణేష్, ఆదిశేషు, పాల్గొన్నారు.
మృతి చెందిన విద్యార్థిని కుటుంబమునకు ఉపాధ్యాయులు చేయుత.. హెడ్మాస్టర్ జానకి
- Advertisement -
RELATED ARTICLES


