విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎం. ఈరన్న గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన చిన్న గౌస్ పదవీ విరమణ అనంతరం ఖాళీగా ఉన్న స్థానంలో ఈరన్న నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సీఐ మాట్లాడుతూ రూరల్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు కృషి చేస్తామని సీఐ ఎం. ఈరన్న తెలిపారు.


