Homeఆంధ్రప్రదేశ్పేదల సొంతింటి కల సాకారమెన్నడు?

పేదల సొంతింటి కల సాకారమెన్నడు?

- Advertisement -

. 6 నెలల్లో ప్రభుత్వం హామీ అమలు చేయకుంటే కలెక్టరేట్ ముట్టడి
. అక్టోబర్ 5న అర్జీదారుల మహావిజ్ఞాపన ధర్నా
. ఇంటి స్థలాల అర్జీదారుల సదస్సులో ముప్పాళ్ళ నాగేశ్వరరావు

విశాలాంధ్ర`గుంటూరు కలెక్టరేట్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 27 మాసాలైన్పటికీ పేదల సొంతింటి కలను సాకారం చేస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చకపోవడం శోచనీయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో మల్లయ్యలింగంభవన్‌లో గురువారం అర్జీదారుల సదస్సు నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో అర్జీదారులు సదస్సుకు హాజరయ్యారు. నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ సీపీఐ అధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదల నుంచి అర్జీలు స్వీకరించి వార్డు, గ్రామ సచివాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో, జిల్లా అధికారుల కార్యాలయంలో అందించామని గుర్తుచేశారు. రానున్న ఆరు నెలల్లో పేదలకిచ్చిన హామీని నెరవేర్చని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని…అక్కడే వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరిక చేస్తూ అక్టోబర్ 5న అర్జీదారుల మహా విజ్ఞాపన ధర్నా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గుంటూరులో 650 చదరవు అడుగుల్లో టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వాలని, లిఫ్ట్ సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గుంటూరు జిల్లాలోని ఇళ్లులేని నిరుపేదలను సమీకరించి…వారి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం కోసం అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగే వరకు సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అర్జీదారుల సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. అక్టోబర్ 5న గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్జీదారులతో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అర్హుýందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ హక్కుల కోసం జరిగే పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
సొంత ఇంటి సాధన సమితి ఏర్పాటు:
సదస్సు అనంతరం సొంత ఇంటి సాధన సమితి పేరుతో నూతన కమిటీని 31 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా రావుల అంజిబాబు, ప్రధాన కార్యదర్శిగా ఆకిటి అరుణ్ కుమార్, కోశాధికారిగా నూతలపాటి చిన్నలు ఎన్నికయ్యారు. సదస్సులో సీపీఐ నగర కమిటీ సభ్యులు గుండెబోయిన లక్ష్మి, పరిమళ బన్ని, బి.వెంకటేశ్వరరెడ్డి, నాయకులు అప్పమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు