Homeతెలంగాణడిసెంబరు 9న సెంట్రలైజ్డ్‌ కిచెన్లు ప్రారంభం.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

డిసెంబరు 9న సెంట్రలైజ్డ్‌ కిచెన్లు ప్రారంభం.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబరు 9న ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు.కిచెన్ల నిర్మాణ పనులను నవంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని కమ్యూనిటీ కిచెన్లను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు.కమ్యూనిటీ కిచెన్ల నిర్మాణానికి పలు సంస్థలు విరాళాలు ప్రకటించాయి. నాగర్‌కర్నూల్‌లో కిచెన్‌ నిర్మాణం కోసం జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ సంస్థ రూ.5.17 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.వికారాబాద్‌లో కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణానికి చైన్‌ ల్యాబ్స్‌ ఇండియా సంస్థ రూ.4 కోట్ల విరాళాన్ని అందించేందుకు ముందుకొచ్చింది.

ఈ మేరకు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయా సంస్థల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ సీఎండీ శేఖర్‌రెడ్డి, సీఈవో అనిల్‌బాబు, చైన్‌ ల్యాబ్‌ ఇండియా ప్రతినిధి సమంత డే, వైస్‌ ప్రెసిడెంట్‌ బుగత సంతోష్‌కుమార్‌ తదితరులు విరాళాల చెక్కులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా హరేకృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధులకు అందించారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, హరేకృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధి సత్య గౌర చంద్రదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆహార అలవాట్లకు అనుగుణంగా అల్పాహారం ఉండాలి
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సెంట్రలైజ్డ్‌ కిచెన్ల నిర్వహణపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు కమ్యూనిటీ కిచెన్లను సందర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, హరేకృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధులకు సూచించారు.ప్రాంతాలను బట్టి ప్రజల ఆహార అలవాట్లు, ఆహార వినియోగంలో వ్యత్యాసాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. అందువల్ల ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా విద్యార్థులకు అందించే అల్పాహారం మెనూను రూపొందించాలని మార్గదర్శనం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు గుర్తించేలా ఏర్పాట్లు చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు.విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల్లోని కేలరీలను లెక్కించేందుకు యాప్‌లను వినియోగించాలని అధికారులకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు