Homeఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఇటీవల రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు