Homeతొలి స్వదేశీ ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్’ జలప్రవేశం

తొలి స్వదేశీ ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్’ జలప్రవేశం

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: దేశ రక్షణ రంగంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ కీలకపాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)లో దేశీయంగా నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్‌ఎస్‌ఎస్-1) ‘సూర్య’ మంగళవారం బంగాళాఖాతంలో జలప్రవేశం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకను ప్రారంభించడంతోపాటు ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్‌ఎస్‌ఎస్-5)కు కీలకమైన కీల్ లేయింగ్ కార్యక్రమం నిర్వహించారు. అలాగే హెచ్‌ఎస్‌ఎల్లో ఆధునీకరించిన స్లిప్వే-4, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో సుదూర సముద్ర కార్యకలాపాలను కొనసాగించేందుకు ఫ్లీట్ సపోర్ట్ షిప్లు కీలకమని తెలిపారు. యుద్ధ నౌకలకు ఇంధనం, ఇతర ద్రవ పదార్థాలు, సరకు, నిర్వహణ సహకారం అందించడంతోపాటు సముద్రంలోనే అవసరమైన సేవలను కొనసాగించేందుకు ఇవి దోహదపడతాయన్నారు. హెచ్‌ఎస్‌ఎల్తో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, స్టార్టప్‌లను అనుసంధానించి సంపూర్ణ నౌకానిర్మాణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం, నేవల్ డాక్యార్డ్, హెచ్‌ఎస్‌ఎల్, విశాఖపట్నం పోర్టు వంటి కీలక సంస్థలు ఒకే నగరంలో ఉండటం విశాఖకు ప్రత్యేక బలమన్నారు. విశాఖపట్నాన్ని ప్రధాన మెరైన్ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనారÝనరెడ్డి, ఎంపీ శ్రీభరత్, నౌకాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు