Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ నేతల సన్నాహక సమావేశం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ నేతల సన్నాహక సమావేశం

- Advertisement -

షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్

విశాలాంధ్ర,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టడంపై చర్చించారు. ఈ సమావేశానికి షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,రఘు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు