Homeఆంధ్రప్రదేశ్జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినిలు

జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినిలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;: రెజ్లింగ్ రాష్ట్రస్థాయికి విద్యార్థినీలు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్10 తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగినటువంటి. రెజ్లింగ్ రాష్ట్రస్థాయి పోటీలు కారంపొడి మండలం జడ్పీ.హెచ్.ఎస్ స్కూల్లో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి పోటీలలో ధర్మవరం జీవి ఈ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ధర్మవరం విద్యార్థినిలు పాల్గొని మైనస్ 33 కేజీ సెమీఫైనల్స్ వరకు పోరాడి సింధు బ్రాంచి మెడల్ సాధించడం జరిగింది అని తెలిపారు.అలానే అండర్ 17 మైనస్ 49 కేజీ విభాగంలో సిందే.డమరేశ్వరి ఫైనల్స్ వరకు పోరాడి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది అన్నారు. అలానే బాలిగోళ్ళ. ప్రణవి అండర్ 14 మైనస్ 50 కేజీ విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఢిల్లీలో జరిగేటువంటి రెజ్లింగ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. అక్టోబర్ 28వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు ఢిల్లీలో జరిగేటువంటి జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికవ్వడం జరిగింది అని తెలిపారు. అలానే జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ సాధించి మన రాష్ట్రానికి మన ఊరికి మన స్కూలుకి మంచి పేరు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు వ్యాయామం ఉపాధ్యాయులు పీ.డీ స్వరూప, పి.డి సరళ వీరందరి ప్రోత్సాహంతోనే ఈరోజు క్రీడాకారులు ప్రతి క్రీడల్లో కూడా పాల్గొని పథకాలు సాధించడం జరుగుతుంది అని కరాటే అండ్ జూడో అండ్ ఖురాష్ కోచ్ ఇనాయత్ భాష, అర్చన, ఉదయ్ అభినందన శుభాకాంక్షలు తెలిపారు. తెలిపారు. అలానే ఈ సర్టిఫికెట్స్ పిల్లలకి కచ్చితంగా చదువులకు స్పోర్ట్స్ కోటా కింద ఫ్రీ సీట్లకు ఉద్యోగాల స్పోర్ట్స్ కోటా కింద కూడా 3 శాతము రిజర్వేషన్ ఉపయోగపడటం జరుగుతుంది అని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆసక్తి గలవారు ఇలాంటి క్రీడల్లో పాల్గొని మీయొక్క బంగారు భవిష్యత్తును ఎంచుకోవాలని జూడో ఎన్.ఐ .ఎస్ కోచ్ ఇనాయత్ భాష తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు