ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం:; ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ విధిగా నిర్వహించాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని స్పందన ఆసుపత్రి, దేవి నర్సింగ్ హోమ్, విజయలక్ష్మి హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరి వెంట డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సాల్మన్ కూడా ఉండి నియమ నిబంధనలు ప్రకారం ఉన్న వాటిని వివరించారు. అనంతరం ఆసుపత్రిలోని స్కానింగ్ కేంద్రాలను వారు పరిశీలించారు. అనంతరం నియమ నిబంధనల ప్రకారం రికార్డులు సరిగా ఉన్నాయా? లేదా? అన్నవాటిని వారి క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి లింగ నిర్ధారణ చేయరాదన్న నోటీస్ బోర్డును ఆసుపత్రి వెలుపలు కూడా తప్పకుండా పెట్టాలని సూచించడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగులను నాణ్యతతో కూడిన వైద్య సేవలను అందించాలని తెలిపారు. తదుపరి నేరుగా రోగులతో కాసేపు మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ఉన్నవా? రినీవల్ చేశారా? అన్న వివరాలను కూడా వివిధ రికార్డులు చూసి తనిఖీ చేశారు. ఓపి వివరాలు, వైద్య చికిత్సలు అందించే తీరు, వివిధ సేవలను అందించే వివరాలను ఆసుపత్రి యాజమాన్యం ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల వివరాలను, రికార్డును కూడా పరిశీలించడం జరిగింది. స్కానింగ్ విషయంలో సరైన క్రమంలో నిర్వహిస్తున్నారా లేదా అన్న వాటిని కూడా పరిశీలించడం జరిగింది. లింగ నిర్ధారణ విషయంలో తప్పకుండా విధిగా ఆ విషయాన్ని పాటించాలని, ఎవరు కూడా స్కానింగ్ చేసిన తర్వాత ఎటువంటి వివరాలు తెలపకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్ తో పాటు ఆయా ఆసుపత్రి యాజమాన్యం పాల్గొన్నారు.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులను నిర్వహించాలి
RELATED ARTICLES