అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు కావాలి – నాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం
విశాలాంధ్ర,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు ప్రక్రియపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల వారీగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఓటరు నమోదు విషయంలో ప్రతి నాయకుడు బాధ్యత తీసుకొని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, గిరిజన ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి ,రాయికల్ శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, సింగిల్ విండో చైర్మన్ అంబటి ప్రభాకర్, సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, జితేందర్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు బాబు నాయక్, శివరెడ్డి, కౌన్సిలర్ రాజు నాయక్, సి. పెంటయ్య, శ్రీను నాయక్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ చైర్మన్ జాంగారి రవి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ ,నేతలు జంగయ్య, నీరటి వాసు తదితరులు పాల్గొన్నారు.


