Homeతెలంగాణఎన్నికల అనంతరమే కొత్త కమిటీ

ఎన్నికల అనంతరమే కొత్త కమిటీ

- Advertisement -

పాత కమిటీయే యదాతథం

కొత్త ప్రతినిధుల ఎన్నిక వరకు పాత కమిటీయే కొనసాగుతుంది

షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు గౌడ్ స్పష్టీకరణ

విశాలాంధ్ర,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం లో నెలకొల్పిన షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ యదాతథంగా కొనసాగుతుందని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ గౌడ్ (రాజు గౌడ్ ) స్పష్టం చేశారు. ఈ క్రమంలో బుధవారం షాద్ నగర్ లో గల శివ గార్డెన్‌లో షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు గౌడ్ మాట్లాడుతూ కమిటీ రద్దుపై వస్తున్న వార్తలను ఖండించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ, కమిటీ రద్దు ప్రచారంలో నిజం లేదని, నిబంధనల ప్రకారం ఎన్నికలు పూర్తయిన తర్వాతనే పాత కమిటీ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. అసోసియేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధికారిక ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేసిన తర్వాత మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. కొత్త కమిటీ ఎన్నికై బాధ్యతలు స్వీకరించేంత వరకు పాత కమిటీయే పూర్తి స్థాయిలో కొనసాగుతుందని ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదని తెలియజేశారు.
అసోసియేషన్ సభ్యులందరూ ఒకటై, ఐక్యతతో ముందుకు సాగాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. త్వరలో అసోసియేషన్ తీసుకోబోయే కార్యాచరణ ను రియల్ ఎస్టేట్ సభ్యులందరికి తెలియజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కబీర్ అహ్మద్, జనరల్ సెక్రెటరీ మంచిరేవుల అశోక్, జాయింట్ సెక్రెటరీ హైదర్ గౌరీ, కార్యవర్గ సభ్యులు యండి సాదిక్, ట్రెజరర్ సతీష్ సీనియర్ సభ్యులు దయానంద్,ప్రభాకర్ చారి,జహంగీర్, జగన్, తాహెర్, సుధాకర్ రెడ్డి,సురేష్, కటిక నర్సింగ్, దండుల శంకర్,బాల్ రెడ్డి, రోమియో రమేష్, శ్రీశైలం, జంగయ్య,లింగం, శివాజీ, కాలేద్ ఖాన్, రమేష్, ఫయాజ్,రవి నాయక్, అష్రాఫ్,పవన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు