Homeఆంధ్రప్రదేశ్పురపాలక ఎన్నికల కు నామినేషన్లు స్వీకరించబడును

పురపాలక ఎన్నికల కు నామినేషన్లు స్వీకరించబడును

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పురపాలక ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించబడునని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చైర్పర్సన్, వాడు మెంబర్ల ఎన్నికల కొరకు నామినేషన్లను అక్టోబర్ 16వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే స్వీకరించబడునని తెలిపారు. నామినేషన్లు రెండు కేంద్రాలలో స్వీకరించబడునని తెలిపారు. అందులో చైర్ పర్సన్ నామినేషన్లు, ఒకటవ వార్డు నుండి 28వ వార్డు మెంబర్ల నామినేషన్లు మున్సిపల్ ఆఫీస్ కదిరి గేటు దగ్గర శాంతినగర్ ధర్మవరం వద్ద స్వీకరిస్తామని, అదేవిధంగా 29వ వార్డు నుండి 48 వార్డుల వరకు బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల సంజయ్ నగర్ ధర్మవరంలో స్వీకరించబడునని తెలిపారు. కావున పోటీపడే అభ్యర్థులు పై విషయాన్ని గమనించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు