Homeతెలంగాణజూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- Advertisement -

జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఇంచార్జ్ మాగంటి సునీత గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం యూసఫ్ గూడా మరియు వెంగల్ రావు నగర్ డివిజన్ల వాసులతో బతుకమ్మ సంబరాలను మహమూద్ ఫంక్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు. యూసఫ్ గూడా, వెంగల్ రావు నగర్ డివిజన్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ ప్రతి సంవత్సరం ప్రజలతో కలిసి బతుకమ్మ పండుగను జరిపేవారని, ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని అన్నారు. ఆయన సతీమణిగా ఆయన ప్రారంభించిన కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమాలు ఏ రాజకీయ లబ్ధి కోసం కాదు, ఏ పదవి కోసం కాదు! గోపీనాథ్ ఎక్కడికీ వెళ్లిపోలేదు, మీరు జరుపుకునే ప్రతి పండుగలో, మీ ఆనందంలో, మీ చిరునవ్వుల్లో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని అన్నారు. ఆయన ప్రజలనే తన కుటుంబంగా భావించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు మాగంటి సునీత బతుకమ్మ కానుకను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేషన్ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ l, కుమార్తెలు మాగంటి అక్షర, మాగంటి దిశిరా, వివిధ డివిజన్ల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు