- Advertisement -
విశాలాంధ్ర నాగారం: కీసర పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎలక్షన్ రెడ్డి శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులుతోపాటు ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిలు ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం పాఠకులకు విధితమే. కాగా దాదాపు నెల రోజులుగా కీసర ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కీసర ఇన్స్పెక్టర్గా ఎలక్షన్ రెడ్డి శుక్రవారం బాధితులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, బాధితులను న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.


