మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున, ధర్మవరం నియోజకవర్గ యువతకు ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో, సంస్కృతి సేవా సమితి సహకారంతో, తిరుపతికి చెందిన ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రతి సంవత్సరం ధర్మవరం నియోజకవర్గానికి చెందిన 100 మంది యువతను ఎంపిక చేసి శిక్షణ అందించాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ వంటి రక్షణ, భద్రతా రంగాల్లో ఉద్యోగాలు సాధించాలనే ఆసక్తి ఉన్న యువతకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వారు తెలిపారు.శారీరక దారుఢ్యం, రాత పరీక్షలు, శారీరక సామర్థ్య పరీక్షలు, ఉద్యోగ ఎంపిక ప్రక్రియపై అవగాహనతో పాటు అవసరమైన మార్గదర్శకత్వం శిక్షణలో అందించనున్నారు అని తెలిపారు.
కాబట్టి ధర్మవరం నియోజకవర్గంలోని అర్హత, ఆసక్తి ఉన్న యువత ఈ విషయాన్ని గమనించాలని, ఎన్నికల అనంతరం శిక్షణ కార్యక్రమం నిర్వహించే వివరాలను తిరిగి తెలియజేస్తామని స్పష్టం చేశారు. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:మల్లిఖార్జున – 7998256789
నరేంద్ర – 9490442576 సంప్రదించాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉచిత డిఫెన్స్ శిక్షణ కార్యక్రమం వాయిదా..
- Advertisement -
RELATED ARTICLES


