విశాలాంధ్ర ధర్మవరం;; మోడల్ స్కూల్ లో నిర్వహిస్తున్న వోకేషనల్ కోర్స్ విద్యార్థినిలకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది అని హెడ్మాస్టర్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలో ఒకేషనల్ కోర్స్ నిర్వహిస్తున్న ఇంటర్ షిప్ కార్యక్రమాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీ నరహరి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ షాపు, శ్రీ లక్ష్మీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ షాపులో పాఠశాల 18 మంది విద్యార్థులకు అందిస్తున్న కుట్టుపని, ఎంబ్రాయిడరీ డిజైనింగ్, డ్రెస్ స్టిచ్చింగ్, తదితర వృత్తి నైపుణ్య శిక్షణను కూడా వారు పరిశీలించారు. విద్యార్థులు నైపుణ్య అభివృద్ధిని పెంచుకొని భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చైతన్య లక్ష్మి, ఒకేషనల్ కోఆర్డినేటర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది.. హెడ్మాస్టర్ పద్మశ్రీ
- Advertisement -
RELATED ARTICLES


