విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగే సమయంలో ఎన్డీఏ కూటమి నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల పై దాడి చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మొట్టమొదటి రోజు నామినేషన్ వేస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులపై మున్సిపల్ ఆఫీసు దగ్గర, రెండవ కేంద్రమైన బిఎస్సార్ బాలురు ఉన్నత పాఠశాల వద్ద రాళ్ల దాడి నిర్వహించడం సరి అయిన పద్ధతి కాదు అని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రానికి వెళ్లి, గాయపడిన వారిని స్ట్రక్చర్ లో ఉంచుకొని ప్రభుత్వాసుపత్రి నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఎన్ డి ఏ నాయకుల పైన ఫిర్యాదు చేశారు. మా పార్టీ నాయకులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
ఎన్డీఏ కూటమి నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు పై దాడి చేయడం దారుణం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


