Monday, February 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగుర్రప్ప స్వామి ఆలయంలో హోమాలు, గ్రామోత్సవం…

గుర్రప్ప స్వామి ఆలయంలో హోమాలు, గ్రామోత్సవం…

ఆలయ అధ్యక్షులు చంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని లోని కోటలో గల శ్రీ గుర్రప్ప స్వామి గుడి పునః ప్రారంభోత్సవ వేడుకలు ఈనెల 1వ తేదీ నుండి మూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారని అధ్యక్షులు చంద్ర, దాతలు, భక్తాదులు తెలిపారు. ఈ సందర్భంగా మొదటి రోజు గంగపూజ, కలశస్థాపన, నవగ్రహ, నాగ పూజలు, అంకురార్పణం అఖండ దీపారాధన జ్వాలాతోరణం తదితర కార్యక్రమాలు ప్రధాన అర్చకులు నరసింహులు, శిష్య బృందం అరుణ్ శర్మ, నవీన్ శర్మ, రాధాకృష్ణ శర్మ, పని శర్మ, రఘు శర్మలు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చంద్ర మాట్లాడుతూ ఈ గుర్రపు స్వామి గుడి పునః ప్రారంభోత్సవం (శివుడు) దాతలు, భక్తాదులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పునః ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అందరి సహాయ సహకారములతో ఈ వేడుకలు విజయవంతం అవుతాయని తెలిపారు. సోమవారముతో ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయని తెలిపారు. పూజ అనంతరం విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన విగ్రహాలకు పాలాభిషేకం, జలాభిషేకం అర్చకుల తో పాటు భక్తాదులు ప్రజలు నిర్వహించారు. తదుపరి అన్నదాన కార్యక్రమంతో పూజా వేడుకలు ముగిశాయి. తదుపరి సాయంత్రం గుర్రప్ప స్వామివారిని పట్టణ పురవీధులలో గ్రామోత్సవంగా ఊరేగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు సుధాకర్,గంగాధర్, ప్రభాకర్, శశిధర్, సోమశేఖర్, రమేష్, రాము, రామాంజనేయులు తోపాటు భక్తాదులు, లోని కోట ప్రజలు, దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు