Saturday, February 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరథసప్తమి మహోత్సవ వేడుకలకు తరలిరండి..

రథసప్తమి మహోత్సవ వేడుకలకు తరలిరండి..

ఆలయ ఈవో వెంకటేశులు, అటహాక్ కమిటీ చైర్మన్ – చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల నాలుగవ తేదీ మంగళవారం రథసప్తమి మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ అర్హకు కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రథోత్సవ మహోత్సవ వేడుకల్లో స్వామివారు సూర్యప్రభ, శేష, గరుడ, హనుమత్, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్ర ప్రభాహనాలలో ప్రత్యేక పూజలు తో అర్చకులు కోనేరా చార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్ ను వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పూజలను నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్య అతిథులుగా ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తోపాటు పలువురు దాతలు కూడా రావడం జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథులతో పాటు వాహనాలకు ఉభయ దాతలుగా వ్యవహరించిన వారికి ప్రత్యేక పూజలతో పాటు సన్మాన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. అనంతరం వివిధ వాహనాలలో స్వామివారిని పట్టణపుర వీధులలో ఊరేగించడం జరుగుతుందని తెలిపారు.కావున ఈ రథసప్తమి వేడుకలకు పట్టణ ప్రజలతో పాటు భక్తాదులు, దాతలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు