సిపిఐ డిమాండ్
విశాలాంధ్ర : చిలమత్తూర్ (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల కేంద్రంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో స్మశాన వాటిక లను కబ్జాల నుండి రక్షించాలని డిప్యూటీ తహసిల్దార్ జగన్నాథకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా భూముల ధరలకు రెక్కల రావడంతో ఇష్టారాజ్యముగా పలువురు స్మశాన వాటిక లను సైతం ఇష్టారాజ్యముగా కబ్జా చేసేసారని, మరికొన్నిచోట్ల చేసేస్తున్నారని, ఈ విషయంపై వెంటనే రెవిన్యూ అధికారులు స్పందించి ప్రతి గ్రామానికి సంబంధించిన స్మశాన వాటికలలో ముళ్ళు పొదలను తొలగించి సర్వేలు చేయించి హద్దులు నిర్ణయించాలని, అదేవిధంగా స్మశాన వాటికలోకి వెళ్లడానికి రహదారులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహప్ప, నాగిరెడ్డి బాలచంద్ర, రామంజి, గంగాధరప్ప, పురుషోత్తం తదితరులు సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
స్మశాన వాటిక లను కబ్జాల నుండి రక్షించండి
RELATED ARTICLES