Monday, February 3, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్ర‌ణాళికాబ‌ద్ధంగా క్రీడ‌ల అభివృద్ధి

ప్ర‌ణాళికాబ‌ద్ధంగా క్రీడ‌ల అభివృద్ధి

స్టేడియం ఏర్పాటుకు 15 ఎక‌రాలు గుర్తింపు
క్రీడాకారుల భవిష్య‌త్తే ప్ర‌భుత్వానికి ముఖ్యం
శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు

విశాలాంధ్ర – అనంతపురం : ప్ర‌ణాళికాబ‌ద్ధంగా అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో అనంత‌పురం జిల్లాలో క్రీడ‌ల అభివృద్ధికి చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. అనంత‌పురం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీని శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు సోమ‌వారం సంద‌ర్శించారు. తొలుత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలోని ఆర్చ‌రీ, ఫెన్సింగ్‌, క‌బ‌డ్డీ, వివిధ స్పోర్ట్స్ కోర్టుల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా డీఎస్ఏ నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతి, క్రీడావసతుల కల్పనపై శాప్ ఛైర్మన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు క్రీడలలో గెలుపొందిన విద్యార్థులతో కరచాలనం చేసి వారిని శాప్ ఛైర్మన్ అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ అనంతపురంలో అత్యుత్త‌మ క్రీడావసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుంద‌న్నారు. అనంతపురంలో స్ అనంత‌రం ప‌లువురు క్రీడాకారుల‌ను అభినందించ‌డంతోపాటు జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా సంఘాల నిర్వాహ‌కుల నుంచి విన‌తిప‌త్రాల‌ను స్వీక‌రించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఎస్డివో విజయభాస్కర్, డీఎస్ఏ సెక్రెటరీ సుబ్బారావు, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగ్గయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు