విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఎక్సైజ్శేషంను ఆకస్మికంగా జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో గల పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకే విక్రయించే విధంగా చర్యలు చేపట్టాలని, ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టాలని ఎక్సైజ్ సీఐ చంద్రమణిని ఆదేశించారు. అనంతరం కార్యాలయ ఆవరణములో గౌడ కులస్తులతో సమావేశాన్ని నిర్వహించి కళ్ళు గీత కార్మికులకు గౌడ కులస్తులకు మద్యం షాపులకు కేటాయించిందని, వీటిని ఈనెల 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా టెండర్ దాఖలు చేయాలని తెలిపారు. ఈనెల 7వ తేదీ కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందని తెలిపారు.