విశాలాంధ్ర తనకల్లు : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య ఉంటే 8500 138 406.. నంబర్ కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని నీటి సరఫరా అధికారులు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరా అధికారులతో పాటు పారిశుధ్య విభాగము ఎంపీడీవో పూల రెడ్డప్ప, ఇంజనీరింగ్ అసిస్టెంట్ బి రాజ్ కుమార్ నాయక్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పై విషయం తెలియజేశారు. కావున మండలంలోని ప్రతి గ్రామంలో ఏదైనా తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.: