ధర్మవరం పట్టుచీరల తయారీ, వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి
విశాలాంధ్ర ధర్మవరం;; రాజకీయ చైతన్యంతోనే, మా సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకుంటామని ధర్మవరం పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజ రవి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని నేసే పేటలో గల కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులతో కలిపి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గిర్రాజు రవి మాట్లాడుతూ మా బాధలు కష్టాలు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదని, మా చేనేత కులస్తుడైన కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కు ఇటీవల మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కృషి చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే తాము ఈ నెల మూడవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మా సమస్యలను పరిష్కారం కొరకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా మా విషయములో స్పందించి తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికై తాను కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాయకత్వాన్ని భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతోనే తాము అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నో కష్టా నష్టాలు కూడా గురి కావడం జరిగిందని వారు బాధను వ్యక్తం చేశారు. తాము తయారుచేసిన చీరలను ఇతర రాష్ట్రాలకు, ముఖ్యమైన నగరాలకు నమ్మకంతో చీరలను విక్రయించడం జరిగిందని, కానీ మా వద్ద కొనుగోలు చేసిన వ్యాపారస్తులందరూ కూడా కోట్ల కొలది డబ్బులను చెల్లించక మమ్ములను ఇబ్బందులను పెట్టడమే కాదు, భయాందోళనకు గురి చేయడం, బెదిరించడం, దోపిడీకి గురి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కి చెక్ బౌన్స్ కేసులో కూడా బెయిల్ ఇవ్వడం పట్ల తాము ఎంతో నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడడం జరిగిందని తెలపడం జరిగిందన్నారు. తమ సమస్యలు విన్న ముఖ్యమంత్రి తాను స్పష్టంగా మీ సమస్యపై ప్రత్యేక నిఘా ఉంచుతూ న్యాయం చేస్తానని, మరో వారం తర్వాత నన్ను కలవాలని ముఖ్యమంత్రి చెప్పడం మాకెంతో సంతోషాన్ని బలాన్ని ఇచ్చిందని వారు స్పష్టం చేశారు. అందుకే ఈనెల 11వ తేదీ శనినారాయణ స్వామి దేవాలయంలో మా సమస్యలను పరిష్కరించుకోవడానికి పట్టణంలోని వ్యాపారస్తులతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూడా హాజరు కారు ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సమావేశము అనంతరం ఈనెల 23వ తేదీన వందలాదిమంది వ్యాపారస్తులతో హైదరాబాద్కు తమ బాధ్యత విషయమై ప్రభుత్వంతో,అధికారులతో, రాజకీయ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి, మా డబ్బులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తామని వారు తెలిపారు. వీలైతే అక్కడే నిరాహార దీక్షకు పూనుకుంటామని వారు స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు గుర్తు చేశారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ధర్మవరం పట్టుచీరల కేంద్రం కు సమస్యలు వస్తే, పట్టించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని వారు తెలిపారు. రాజకీయ చైతన్యం పొందేలా రాజకీయ ఎదుగుదలకు తాము పోరాటం సలుపుతామని భవిష్యత్తులో తమ రాజకీయ సత్తాను చూపుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నీలూరి శ్రీనివాసులు, రంగం ఆదినారాయణ, సభ్యులు బీరే కేశవ, ఉడుముల సంజీవ్, గిర్రాజు శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ చైతన్యంతోనే మా సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకుంటాం..
RELATED ARTICLES