Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి!

ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి!

ధర్మవరం ట్రాఫిక్ ఎస్. ఐ.
ఎస్.వెంకట రాముడు
విశాలాంధ్ర ధర్మవరం : జిల్లా ఎస్.పి. శ్రీ మతి వి.రత్న ఆదేశాలు మేరకు ధర్మవరం డి. ఎస్. పి.హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణం లో ట్రాఫిక్ బందోబస్త్ చర్యలు కట్టు దిట్టం చేశామని ధర్మవరం ట్రాఫిక్ ఎస్ ఐ ఎస్.వెంకట రాముడు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూముఖ్యం గా రహదారి భద్రతా మాసోత్స వాలు సందర్బంగా హెల్మెట్ వాడకం పై జిల్లా ఎస్ పి వి.రత్న ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఈ విషయం అందరూ గమనించాలని, ప్రతీ ఒక్కరూ ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చును అని అన్నారు.రోడ్డు కు అడ్డంగా ద్వి చక్ర వాహనాలు నిలుపరాదన్నారు.స్పీడ్ కు కళ్లెం వేయాలన్నారు.ట్రాఫిక్ పై ఈ మేరకు ఆటో,ఇతర వాహనాలు వారికి రోడ్డు పక్కన పండ్లు అమ్మేవారికి ఈ విషయం లో అవగాహన కల్పించామన్నారు.రోడ్డు భద్ర తా నిబంధనలు అందరూ పాటించాలన్నారు.హెల్మెట్ ధరించిన యెడల ప్రమాదాలు అరికట్టవచ్చును అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు