విశాలాంధ్ర ధర్మవరం;;రోడ్డు పై వాహనాల్లో వెళ్ళేటప్పుడు వాహనంపై నియంత్రణ,రోడ్డుకు ఇరువైపులా అప్రమత్తతతో ఉండాలని, అప్పుడే ప్రమాదాలను నివారించేందుకు ఆస్కారం ఉంటుంది అని టూ టౌన్ సీఐ రెడ్డప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కళాశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ రెడ్డప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.లైసెన్స్ లేనిదే రోడ్డు పై వాహనాలు నడపకూడదని,అలా వెళితే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినపుడు నేడు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటున్నారే తప్ప వారిని కాపాడే ప్రయత్నం ఎవరూ చేయటం లేదని ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆయన పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ పేరిట అవార్డులను తీసుకొచ్చిందని, ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి కేంద్రం ద్వారా రూ. 5000 రివార్డు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, అధ్యాపకులు కృష్ణయ్య, హరీష్, శ్రీనివాసులు,శిరీష, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత, నియంత్రణ అవసరం
RELATED ARTICLES