Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రారంభమైన భద్రావతి శ్రీ భావన రుషింద్రుల వారి 59వ కళ్యాణ మహోత్సవ వేడుకలు..

ప్రారంభమైన భద్రావతి శ్రీ భావన రుషింద్రుల వారి 59వ కళ్యాణ మహోత్సవ వేడుకలు..

పద్మశాలియ బహుత్తమ సంఘం.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మార్కెట్ వీధిలో గల మార్కండేయ స్వామి దేవాలయంలో శ్రీ భద్రావతి భావన రుచేంద్రుల స్వామివారి 59వ కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా అర్చకులు, కుల సంఘం బంధువులు, దాతలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు పుత్తా రుద్రయ్య, ఉపాధ్యక్షులు జింక నాగభూషణ, ప్రధాన కార్యదర్శి మెటీకల బాల కుల్లాయప్ప,కోశాధికారి వడుకుల భాస్కర్ మాట్లాడుతూ ప్రధాన అర్చకులు శ్రీ వచ్చా వారి శిష్య బృందం ఆధ్వర్యంలో మొదటి రోజు ఆలయంలో గోపూజ, మహాగణపతి పూజ, కంకణ ధారణ, నవగ్రహ సహిత కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించామనీ తెలిపారు. తదుపరి ప్రత్యేక పూజలతో పాటు ధ్వజారోహణం, బిందె సేవను (గంగపూజ), అర్చకుల వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ చెరువులో నిర్వహించారు. బిందె సేవ ఉభయ దాతలుగా గల 17 మంది కుల బాంధవుల దాతల పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించి, ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు. తదుపరి సాయంత్రం కూచిపూడి కళాకేంద్రం ధర్మవరం వారిచే భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సహాయ కార్యదర్శులు పోలాంకి వెంకటరామయ్య, పొలంకి లక్ష్మీనారాయణ, బుధారపు శ్రీనివాసులు, గుర్రం లక్ష్మీనారాయణ, గుర్రం గంగాధర్, ఊట్ల నరేందర్ జింక గోవిందు, పురుషోత్తం, ప్రకాష్, జానపాటి మోహన, చంద్రశేఖర్, రాము, రెడ్డప్ప, రామ్మోహన్, ధనుంజయ తో పాటు కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు