Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్నదాన సేవా కార్యక్రమం దైవ సేవతో సమానం..

అన్నదాన సేవా కార్యక్రమం దైవ సేవతో సమానం..

యువర్స్ ఫౌండేషన్ సంస్థ
విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదాన సేవా కార్యక్రమం దైవ సేవతో సమానమని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, మాజీ అధ్యక్షులు వై కే. శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సుంకు సుకుమార్, సహకార దర్శి గర్రె రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 300 మంది రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పుల్లయ్య గత రెండు సంవత్సరాలుగా ప్రతి మొదటి గురువారం ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, భౌతిక సేవలు అందించడం ఎంతో సంతోషదాయకని తెలిపారు. వీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలవడం జరిగిందని తెలిపారు. తదుపరి వారికి యువర్స్ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఆసక్తి గల దాతలు యువర్స్ ఫౌండేషన్ కమిటీని సంప్రదించవచ్చునని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు