Thursday, December 26, 2024
Homeఆంధ్రప్రదేశ్సోషల్‌ మీడియాలో పోస్టులపై పిల్.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సోషల్‌ మీడియాలో పోస్టులపై పిల్.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ వేయడంపై హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యలు చేసింది. పిల్‌‌కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు