విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విశాలాంధ్ర నందిగామ :-స్నేహశీలి మృదుస్వభావి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిపిద్దామని ఏపీ ప్రభుత్వ విప్,నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులతో కలిసి పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను,పట్టభద్రులను రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని,అధికారం చేపట్టిన ఎనిమిది నెలల అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అభివృద్ధి సంక్షేమ ఫలాలు సామాన్య ప్రజానీకానికి అందాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని దానికోసం ఈనెల 27వ తేదీన జరిగే బోయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును 1 వ ప్రాధాన్యత ఓటుగా వేయవలసింది గా ఆమె పట్టభద్రుల ను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రామకృష్ణ, మండల అధ్యక్షులు వీరంకి వీరాస్వామిన్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…