Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్చలిసింగం రహదారికి కృషి ….

చలిసింగం రహదారికి కృషి ….

– రాజధాని అమరావతిలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కలసిన జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు
చోడవరం నియోజక వర్గంలోని చలిసింగం గిరిజన గ్రామానికి తక్షణమే రోడ్డు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందుచేత.
సానుకూలం గా స్పందించిన పవన్ కళ్యాణ్
విశాలాంధ్ర – చోడవరం అనకాపల్లి జిల్లా : రాజధాని అమరావతిలో అసెంబ్లీ వద్ద ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు బుధవారం కలిశారు. చోడవరం నియోజకవర్గంలోని రావికమతం మండలంలో కొండపైన ఉన్న గిరిజన గ్రామమైన చలిసింగంకు తక్షణమే రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దశాబ్దాలుగా ఆపరిష్కృతం గా ఉండి , ప్రతీ ఎన్నికల్లోనూ రాజకీయ నాయకులు ఇస్తున్న నెరవేరని హామీగానే ఉండిపోతున్న ఈ సమస్య గూర్చి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ వారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను వారి దృష్టికి తీసుకు వచ్చారు. చలిసింగం గ్రామం నందు సుమారు 450 మంది నివాసితులు ఉన్నారని , సరైన రహదారి లేకపోవడం వలన వినాశకరమైన పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయని , ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు పిల్లలు వైద్య చికిత్స పొందడంలో జాప్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ,గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయులు సక్రమంగా హాజరుకాకపోవడంతో విద్యాపరంగా వీరికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది అని తెలియచేసారు.
చాలా అత్య అవసరమైన ఈ రహదారిని ఏర్పాటు చేయడానికి, పంచాయతీ రాజ్ శాఖ నుండి ఆర్థిక మంజూరుతో పాటు అటవీ శాఖ నుండి అనుమతులు అవసరం కావున వాటి మంజూరు కొరకు అభ్యర్దించుట జరిగింది.
ఈ విషయంలో చలిసింగం గిరిజన ప్రజానీకం పవన్ కళ్యాణ్ పై ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంది అని వారికి తెలియచేయడం జరిగింది. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ రహదారి నిర్మాణం కోసం అవసరమయిన చర్యలు తప్పక తీసుకొంటామని తెలియచేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు