Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగాసనాల ముద్రికలుపోస్టర్లు విడుదల చేసిన ఆర్డిఓ మహేష్

యోగాసనాల ముద్రికలుపోస్టర్లు విడుదల చేసిన ఆర్డిఓ మహేష్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర, కళాశాల క్రీడా మైదానంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో మహేష్ చేతులమీదుగా యోగాసనాల ముద్రి కాల పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు. చెట్లను నరకడం, పర్యావరణానికి హాని కలిగించే వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. పర్యావరణం సరిగా ఉంటే ప్రజల ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ సేవా సంఘం అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు సూర్య ప్రకాష్, కార్యదర్శి గుద్దిట్టి నాగార్జున, సూర్య నాగరాజు, నాగసముద్రం నాగభూషణ, శ్రీనివాస్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు